ETV Bharat / state

రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : పొన్నాల

రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంభిస్తున్నాయని కాంగ్రెస్​ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఎన్నికల ముందు ఎమ్​ఎస్​ స్వామినాథన్​ కమిషన్​ సిఫార్సులను అమలు చేస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు.

author img

By

Published : Jan 9, 2021, 7:58 PM IST

congress leader ponnala lakshmaiah
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ కాంగ్రెస్​ సీనియర్​ నేత పొన్నాల లక్ష్మయ్య

రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న ప్రధాని మోదీ ఇప్పుడేమో వారి ఉసురు తీస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ కర్షకుల పట్ల మొండి వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్​ సిఫార్సులను అమలు చేస్తామన్న హామీని మర్చిపోయారా అని నిలదీశారు. చర్చల పేరుతో నాటాకాలాడుతున్నారని కేంద్రంపై పొన్నాల ధ్వజమెత్తారు. అవినీతి బయట పడుతుందనే భయంతో సీఎం కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు.

ఇదీ చూడండి: 'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.