కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను తెరాస నాయకులతోపాటు పోలీసులు వేధిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని... పార్టీ వారికి పూర్తిగా అండగా ఉంటుందని అన్నారు. పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించాలని నిరంజన్ కోరారు. రహమత్‌నగర్‌లో సిరిసిల్లకు చెందిన తెరాస నాయకులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతూ దొరికారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.
ఈ విషయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ పంపి ఆ నేతలను పట్టుకున్నామని 15,300 రూపాయలు దొరికాయని ఎన్నికల సంఘం తమకు తెలిపిందని పేర్కొన్నారు. అయితే పోలీసు కమిషనర్ తర్వాత ఇచ్చిన లేఖలో ఎలాంటి డబ్బులు దొరకలేదని.. కాంగ్రెస్ నాయకులు ఎఫ్ఎస్‌సీ టీమ్ వాహనాలను పగులగొట్టారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ సమస్యలపై ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ