Jaggareddy Protest on Inter Results: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వైఫ్యలం వల్లనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపిస్తున్న జగ్గారెడ్డి.. విద్యార్థులకు మద్దతుగా ఇంటర్మీడియట్ బోర్డు వద్ద దీక్షకు కూర్చున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న వారే ఉన్నారని అన్నారు. మొదటి ఏడాది నుంచి రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసిన తర్వాత పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 2019లో ఇదే ఇంటర్ బోర్డు వైఫల్యం వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇప్పుడు కూడా లోపభూయిష్టంగా వ్యవహరించడం వల్లనే ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: Cyberabad CP: 'నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా'