ETV Bharat / state

Congress Joinings in Telangana : ఆ నలుగురు నేడు కాంగ్రెస్​లో చేరతారు..! - revanth reddy latest comments

Congress Joinings in Telangana : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో జరగాల్సిన చేరికల కార్యక్రమం గురువారానికి వాయిదా పడిందని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. మల్లిఖార్జున ఖర్గే షెడ్యూల్‌ బిజీగా ఉండడంతో.. బుధవారం రోజున చేరికలు కుదరలేదని స్ఫష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు స్పందించి.. కాంగ్రెస్​ ఒత్తిడి చేయడం వల్ల ప్రభుత్వం చేసిందని వివరించారు.

Mallu Ravi Talk about Congress Joinings
Mallu Ravi Talk about Congress Joinings
author img

By

Published : Aug 2, 2023, 9:59 PM IST

Updated : Aug 3, 2023, 6:35 AM IST

చేరికల కార్యక్రమం గురువారానికి వాయిదా పడింది

Mallu Ravi Talk about Congress Joinings : దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో జరగాల్సిన చేరికల కార్యక్రమం గురువారానికి వాయిదా పడిందని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌ రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టిలతో పాటు పలువురు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల సమక్షంలో నలుగురు నాయకులు హస్తం కండువా కప్పుకోనున్నారు. మంగళవారం దిల్లీకి వెళ్లిన నాయకులు.. బుధవారం రోజున మల్లిఖార్జున ఖర్గే షెడ్యూల్‌ బిజీగా ఉండడంతో.. సమయం కుదరక చేరలేదని మల్లు రవి వివరణ ఇచ్చారు.

గురువారం ఉదయం 9.15 గంటలకు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన అనంతరం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి కుమారుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎంపీపీ మెఘారెడ్డి, ఆల్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ జీవతల్ తదితరులు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని భావించినా.. వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. భారీ బహిరంగ సభ గురించి తరువాత ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు.

"కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ ఈ నెల 20న పెట్టుకున్నాం. వర్షాల వల్ల ఈ నెల 30కి మార్చాం. వర్షాల ప్రభావం ఉండడంతో మేమే ఆ సభను ఆపివేశాం. వర్షాలు పూర్తిగా తగ్గిన తరవాత సభ ఏర్పాటు చేస్తాం. ముఖ్యమైన నాయకులు రేపు 9:30కి పార్టీలో చేరనున్నారు." - పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి

Revanth Reddy Respond on Rythu Runa Mafi : కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి కారణంగానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. రుణమాఫీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ విజయంగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే ఇవాళ కేసీఆర్ రుణమాఫీ ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

Telangana Congress : కాంగ్రెస్​లో తాత్కాలికంగా ఆగిన చేరికలు.. ఆ తర్వాతనే మళ్లీ జోరు

కేసీఆర్ అసమర్థత వల్లే.. 4 సంవత్సరాలు ఆలస్యం : రుణమాఫీ అమలు చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని ముందే తాము హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించామని ఆయన వెల్లడించారు. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ.. 4 సంవత్సరాలు ఆలస్యం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై పడిన అన్నిరకాల వడ్డీలతో సహా మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అందే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుందని రేవంత్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Aug 3, 2023, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.