ETV Bharat / state

రాజగోపాల్‌ వ్యవహారం.. టీకాంగ్రెస్‌ ముఖ్యనేతలకు హైకమాండ్‌ పిలుపు - తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు హైకమాండ్‌ పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. పార్టీలో చేరికలు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరగనుంది.

Congress
congress high command will meet telangana leaders
author img

By

Published : Aug 1, 2022, 12:09 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు నేతలకు ఆ పార్టీ హైకమాండ్‌ నుంచి పిలుపొచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడతారనే ప్రచారం నేపథ్యంలో ఆ వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్యనేతలను దిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో పార్టీలో చేరికల అంశంతో పాటు రాజగోపాల్‌ వ్యవహారంపైనా చర్చించే అవకాశముంది.

పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఇప్పటికే టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని సైతం దిల్లీ రావాలని సమాచారం ఇచ్చినప్పటికీ వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపనట్లు సమాచారం. ఈ పరిణామాలపై చర్చించేందుకు అవసరమైతే ఫోన్‌లో అందుబాటులో ఉంటానని జానారెడ్డి చెప్పినట్లు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.