ఎన్నికలు సక్రమంగా జరగాలంటే అవినీతి అధికారులను వెంటనే ఆయా విధుల నుంచి తప్పించాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అమరేందర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫాం 7 ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపకుండానే ఓట్ల తొలగింపునకు ప్రొసీడింగ్స్ ఇచ్చారని పేర్కొన్నారు. తక్షణం ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : మోదీకి పోటీగా బరిలోకి దిగేది తెరాస తరఫు రైతులే