ETV Bharat / state

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు

Congress Election Campaign In Telangana 2023 : విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్‌.. అన్నివర్గాల మద్దతు కూడగట్టుకుంటోంది. రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలతోపాటు స్టార్‌ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు పోల్‌ మేనేజ్‌మెంట్‌.. నాయకులను సమన్వయం చేయడం.. అంతర్గత లోటుపాట్లను సరిదిద్దడం లాంటి వాటిపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని పార్టీ నాయకులతోపాటు సర్వేలు చెబుతున్నాయన్న ధీమాలో ఉన్నా.. చివరి క్షణంలో ఇబ్బందులు తలెత్తకుండా హస్తం అధిష్ఠానం వ్యూహాలకు పదును పెడుతోంది.

Congress Election Campaign In Telangana
రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 11:51 AM IST

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు

Congress Election Campaign In Telangana 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికలను(Telangana Assemble Election) కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి తీరాలన్న కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి , ఉత్తమ్​కుమార్ రెడ్డి , భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి , జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు.. 70 నుంచి 80 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏఐసీసీ యంత్రాంగం రాష్ట్రంలో మకాం వేస్తోంది. నియోజక వర్గాల వారీగా నాయకుల సమన్వయం, ఓటర్ల మనోగతం, పోల్​ మేనేజ్​మెంట్‌ తదితర అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌ రానున్న కేసీ వేణుగోపాల్‌ పోలింగ్‌ నిర్వహణ, ఇతర అంశాలపై వార్‌ రూమ్‌ ఫీడ్​బ్యాక్‌ ఆధారంగా సమీక్షలు నిర్వహిస్తారు.

దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి- ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి: రేవంత్​రెడ్డి

Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్‌ అభ్యర్ధులకు మద్దతుగా స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచార వేడిని పెంచుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా.. రాష్ట్రంలో అభ్యర్ధులకు మద్దతుగా వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. మరో వంద మంది వార్​రూమ్ నిర్వహిస్తున్నారు. జైరాం రమేష్‌(Jairam Ramesh) లాంటి వాళ్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. అభ్యర్ధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 70కి పైగా నియోజకవర్గాలను పార్టీ అగ్రనేతలు చుట్టేశారు. నిర్దేశించిన 80కిపైగా నియోజకవర్గాల్లో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్‌ రెడ్డిలు.. ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. మిగిలిన 39 స్థానాలకు సంబంధించిన ప్రచార ప్రణాళికలను పీసీసీ రూపొందిస్తోంది.

80 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు-తప్పదు భారీ మెజార్టీ : భట్టి విక్రమార్క

Priyanka Gandhi Telangana Tour 2023 : ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రియాంక గాంధీ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి, ఒకటిన్నరకు హుస్నాబాద్, 3గంటలకు కొత్తగూడెం ప్రచార సభల్లో ప్రియాంక పాల్గొంటారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ఆమె ప్రచారం చేస్తారు. రాత్రికి ఖమ్మంలోనే ప్రియాంక బస చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పాలేరు, ఒకటిన్నరకు సత్తుపల్లి, 2గంటల 40నిమిషాలకు మధిర ప్రచార సభల్లో ప్రియాంక పాల్గొంటారు. అనంతరం.. అక్కడి నుంచి విజయవాడ చేరుకొని గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీకి వెళతారు.

DK Shivakumar Election Campaign in Telangana 2023 : ఈ నెల 27న మళ్లీ తెలంగాణకు రానున్న ప్రియాంకగాంధీ.. మరో రెండు రోజులపాటు ప్రచారంలో పాల్గొంటారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఇవాళ, రేపు రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో శివకుమార్‌ కార్నర్ మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్‌లోని అంబర్​పేట్‌ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. రేపు హైదరాబాద్‌లోని పలు నియోజక వర్గాలలో రోడ్ షోలు, కార్నర్ సమావేశాల్లోనూ ఆయన పాల్గొంటారు.

Rahul Gandhi Telangana Tour 2023 : శనివారం రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. ఈ నెల 28వ తేదీ వరకు ప్రచారాల్లో పాల్గొంటారు. ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సీడబ్యూసీ సభ్యుడు సల్మాన్‌ ఖుర్షీద్‌లు కూడా రేపు తెలంగాణాకు వచ్చే అవకాశాలున్నాయి. నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో మోహరిస్తున్న అగ్రనాయకులు 28వ తేదీ వరకు మకాం వేసి కాంగ్రెస్‌ అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయనున్నారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం : విజయశాంతి

మరో వారం రోజులే గడువు - జోష్​ మీదున్న కాంగ్రెస్ - బీఆర్ఎస్​పై విమర్శలే అస్త్రంగా ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.