ETV Bharat / state

Congress Dharna: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి' - Congress Dharna on Paddy Procurement

ధాన్యం కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు పబ్లిక్ గార్డెన్​ నుంచి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

Congress Dharna on Paddy Procurement
కాంగ్రెస్ ధర్నా
author img

By

Published : Nov 18, 2021, 1:10 PM IST

రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ హైదరాబాద్‌ పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన ప్రదర్శన (Congress Dharna on Paddy Procurement) నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు కాంగ్రెస్‌ నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు.

సాగుచట్టాలు, ధాన్యం కొనుగోలు విషయంలో అధికార పార్టీలు ధర్నా చేయడమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు... చట్టపరంగా చేయాల్సిన పనులెందుకు చేయట్లేదని నిలదీస్తున్నారు. సీఎం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసే ముందు అసెంబ్లీ సమావేశాలు పెట్టి సాగుచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ధర్నా

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయి. కేంద్రం కొనట్లేదని రాష్ట్రం, రాష్ట్రం కొనట్లేదని కేంద్రం సాకులు చెప్తున్నాయి. 1947 నుంచి రాని సమస్య ఇప్పుడెందుకొస్తోంది? గత ప్రభుత్వాలకు రాని సమస్యలు భాజపా, తెరాసకు మాత్రమే వస్తున్నాయి. రైతుల పంటలు కొనాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. అంతిమంగా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి.. ఈ రంగాన్ని కార్పొరేట్​ సంస్థల పాలిట చేసి.. రైతులను బలివ్వబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేయటం ఏంటి.'

-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

'రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టినట్లు కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తెలిపారు. అన్నదాతల ప్రయోజనాలు దెబ్బతీసేలా రెండు ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆరోపించారు.'

-అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు

భాజపా, తెరాసల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించిన కాంగ్రెస్‌ నేతలు... ప్రజల దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని ధ్వజమెత్తారు. చివరిగింజ వరకు కొంటామన్న కేసీఆర్ ఆ మాట మీద నిలబడతారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: TRS Maha Dharana: అవసరమైతే దిల్లీకి వెళ్లి యాత్ర చేయాల్సి ఉంటుంది: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.