తెలంగాణ పీసీసీ కోర్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యులుగా కొత్తగా నియామకమైన ఏఐసీసీ ఇన్‌ఛార్జి మణికమ్ ఠాగూర్ ఆధ్వర్యంలో జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు.
దుబ్బాక ఉప ఎన్నిక, మండలి ఎన్నికలలో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌లలో బూత్, బ్లాక్ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కార్యకర్తలకు క్రమశిక్షణ చాలా అవసరమని... సోషల్ మీడియాను ఇష్టానుసారంగా వాడకూడదని సూచించారు. ప్రతి 15 రోజులకొకసారి కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. అసెంబ్లీపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మణికమ్ ఠాగూర్ దిశా నిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: త్వరలోనే వ్యవసాయ క్లస్టర్ల పునర్విభజన పూర్తిచేస్తాం : నిరంజన్‌రెడ్డి