ETV Bharat / state

congress on rahul schedule:'తెరాస స‌ర్కార్‌ను తరిమికొట్టడమే ల‌క్ష్యంగా వరంగల్ సభ'

రాహుల్ సభను విజయవంతం చేసేందుకు సమన్వయం చేసుకునేందుకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ కార్యక్రమాల క‌మిటీ ఛైర్మన్‌ ఏలేటి మ‌హేశ్వర రెడ్డి తెలిపారు. వారికి బాధ్యతలు ఇప్పటికే అప్పగించామని వెల్లడించారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

congress on rahul schedule
ఏఐసీసీ కార్యక్రమాల క‌మిటీ
author img

By

Published : May 4, 2022, 6:40 PM IST

ఉద్యమం నుంచి మొదలుకుని ఎన్నో పోరాటాలకు ఓరుగల్లు వేదికగా నిలిచిందని రాహుల్ గాంధీ ప‌ర్యట‌న స‌మ‌న్వయ క‌మిటీ ఛైర్మన్ ఏలేటి మ‌హేశ్వర రెడ్డి అన్నారు. వరంగల్ మే 6న జరగబోయే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసేందుకు 15 కమిటీలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. గాంధీభ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన సమన్వయ కమిటీ వివిధ అంశాల‌పై చ‌ర్చించారు.

వరంగల్ ఉద్యమాల ఖిల్లా.. ఎన్నో పోరాటాలకు నిలయమ‌ని మ‌హేశ్వర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.. రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను కేసీఆర్ సర్కార్ బలవంతంగా లాక్కొంటుందని ఆరోపించారు. తెరాస స‌ర్కార్‌ను తరిమికొట్టడమే ల‌క్ష్యంగా ఈ వరంగల్ రైతు సంఘ‌ర్షణ స‌భ ఏర్పాటు చేసిన‌ట్లు మ‌హేశ్వర రెడ్డి తెలిపారు.

రాహుల్ షెడ్యూల్ ఇలా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షెడ్యూల్‌ను ఏలేటి మ‌హేశ్వర రెడ్డి వెల్లడించారు. ఈ నెల ఆరో తేదీన దిల్లీ నుంచి రాహుల్ గాంధీ ప్రత్యేక‌ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వ‌స్తారని తెలిపారు. అక్కడ నుంచి నేరుగా హెలికాఫ్టర్​లో వరంగల్ వెళ్లతార‌ని పేర్కొన్నారు. సభ ముగిసిన‌ తర్వాత రాహుల్ గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకుని రాత్రికి తాజ్ కృష్ణలో బస చేస్తార‌ని వివ‌రించారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం 7వ తేదీన‌ సంజీవయ్య పార్క్ వెళ్లి దామోద‌రం సంజీవ‌య్యకు నివాళులు అర్పిస్తార‌ని వెల్లడించారు. అక్కడి నుంచి చంచల్​గూడ జైలులో ఉన్న ఎన్​ఎస్​యూఐ నేతలను పరామర్శిస్తార‌ని తెలిపారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్ వెళ్తారని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రాహుల్​ ఓయూ టూర్​... మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌ఎస్‌యూఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.