మిడ్ మానేరుతో పాటు ఎన్నో ప్రాజెక్టులను కట్టిన ఘనత కాంగ్రెస్‌ది అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పేదవారికి ఇందిరమ్మ గృహాలు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సహాయం చేసిందని... అప్పుడు రాష్ట్రానికి ఇంత అప్పు లేదని గుర్తు చేశారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే కేసీఆర్ అప్పులు చేసి ప్రజల మీద భారం వేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే సరిపోయిన శాసనసభ ఇప్పుడు సరిపోదంటూ కొత్తవి నిర్మిస్తున్నారని మండిపడ్డారు. సొంత ఇళ్లు కట్టుకున్నట్లే ఎవరి అనుమతి తీసుకోకుండా కేసీఆర్ శంకుస్థాపన చేశారని భట్టి విమర్శించారు.
ఇదీ చూడండి : అసెంబ్లీ నిర్మాణంపై విచారణ జులై 8కి వాయిదా