Congress Chevella Meeting : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్.. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ (Chevella Congress Pubilc Meeting) నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని వివరించారు. ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఖర్గే విడుదల చేస్తారని రేవంత్ స్పష్టం చేశారు.
ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈ నెల 29వ తేదీన మైనారిటీ డిక్లరేషన్ (Minority Declaration) వరంగల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ క్రమంలోనే ఓబీసీ (OBC), మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామని తెలిపారు.
Revanth Reddy on Chevella Prajagarjana Sabha : ఈ సందర్భంగా తమ పార్టీ కార్యచరణను వివరించారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. అలాగే 'తిరగబడదాం.. తరిమికొడదాం' కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్లమెంట్ వారీగా కో-ఆర్డినేటర్లను నియమించినట్లు రేవంత్ పేరొన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
Chevella Congress Pubilc Meeting : కార్యక్రమంలో మాట్లాడిన మాణిక్‌రావ్ ఠాక్రే (ManikRao Thackeray).. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్స్, ఛార్జ్ షీట్స్, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ చేరేలా చూడాలని పేర్కొన్నారు. 'హాథ్ సే హాథ్ జోడో' కార్యక్రమం తరహాలో ప్రస్తుత కార్యాక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వీరితో పాటు ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, సీఎల్పీ (CLP) నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, నాయకులు పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Congress MLA Ticket Applications : కాంగ్రెస్ రేసుగుర్రాల ఎంపిక.. తొలిరోజు 18 దరఖాస్తులు
Revanthreddy Speech in Lok Sabha : 'ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాల పుస్తకం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో'