Congress Bus yatra Starts on 18th October : అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారం (Congress Bus Yatra) ములుగు నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొంటున్న బస్సు యాత్ర ద్వారా ప్రచారం జరగనుంది. ఇవాళ సాయంత్రం ములుగులోని రామప్ప గుడిలో రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రత్యేక పూజలు చేస్తారు. ములుగులో పబ్లిక్ మీటింగ్ తర్వాత బస్సు యాత్రలో భూపాలపల్లి చేరుకుని రాత్రి బస చేస్తారు. రెండో రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిరుద్యోగ యువతతో పాదయాత్ర చేస్తారు.
ఆ తర్వాత రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ కార్మిక సంఘాలతో సమావేశం అవుతారు. అక్కడ నుంచి సాయంత్రానికి పెద్దపల్లి చేరుకుంటారు. అక్కడ పబ్లిక్ మీటింగ్ తర్వాత రైస్ మిల్లర్స్ సంఘాలతో పాటు రైతులతో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి కరీంనగర్ చేరుకుని పాదయాత్రలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు కరీంనగర్ నుంచి బోధన్ చేరుకుంటారు.
Telangana Congress Bus Yatra 2023 : తిరగబడదాం- తరిమికొడదాం అనే నినాదంతో.. కాంగ్రెస్ బస్సు యాత్ర
Rahul Gandhi Telangana Tour : ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలతో ఇంటరాక్షన్ ఉంటుంది. అనంతరం నిజామ్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు ఆర్మూరు చేరుకుని పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడ నుంచి రాత్రి 7 గంటలకు నిజామాబాద్ చేరుకొని పాదయాత్రలో పాల్గొంటారు.
ఈ బస్సు యాత్ర ద్వారా నిర్వహించనున్న ప్రచారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతారు. యువ, వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ ఈ మూడు డిక్లరేషన్స్‌తో పాటు చేయూత 4వేల పెన్షన్, ఆరు హామీల గ్యారంటీ కార్డులను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హస్తం నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ఐక్యతను చాటేందుకు ఈ బస్సు యాత్ర ఉపయోగ పడుతుందని వారు భావిస్తున్నారు.
congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్, షెడ్యూల్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు (Revanth Reddy) సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెనర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు బస్సు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20 వ తేదీ వరకు మూడు రోజులు బస్సు యాత్ర ఉండనుంది.
congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్, షెడ్యూల్
Telangana Congress Bus Yatra : బస్సుయాత్రపై 10న పీఏసీ తుది నిర్ణయం.. ఈనెల 15 నుంచే ప్రారంభం?