ETV Bharat / state

హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ పార్టీ - highcourt of telangana

రాజకీయ దురుద్దేశంతో కక్షపూరితంగా కాంగ్రెస్​ పార్టీ కార్యకలాపాలను ప్రభుత్వం, పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్​ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. సీనియర్​ న్యాయవాది రచనారెడ్డి కాంగ్రెస్​ పార్టీ తరఫున రిట్​ దాఖలు చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం పోలీసుల సహకారంతో అడ్డుకట్ట వేస్తోందని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ ఆరోపించారు.

congress approach to highcourt
హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ పార్టీ
author img

By

Published : Jun 18, 2020, 7:24 PM IST

ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని వేదికలపైనా తమ వాదనలను వినిపించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని భావించిన కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ హైకోర్టును ఆశ్రయించింది. సీనియర్ న్యాయవాది రచనారెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి జలదీక్షకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌... కృష్ణ, గోదావరి నదులపై కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్లులను సందర్శించి నిరసన దీక్షలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల రెండో తేదీన గోదావరి నదులపై ప్రాజెక్టుల సందర్శనకు, నాలుగో తేదీన మంజీరా డ్యాం సందర్శన, 13వ తేదీన గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల సందర్భనకు వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. మరికొందరిని మార్గమధ్యలో అడ్డుకుని అరెస్టు చేశారు. అదే విధంగా ఈ నెల 11వ తేదీన 'ఛలో సచివాలయం' కార్యక్రమానికి కాంగ్రెస్‌ పిలుపునివ్వగా... ముందు రోజు రాత్రి నుంచే ముఖ్యమైన కాంగ్రెస్‌ నాయకుల ఇళ్ల వద్ద మకాం వేసిన పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టాలనుకున్నా.... ముందు రోజు రాత్రి నుంచే పోలీసులు ఆయా నేతల ఇళ్ల వద్ద మోహరిస్తున్నారు. ఇళ్ల నుంచి కదలకుండా గృహనిర్బంధంలో ఉంచుతున్నారు. ఎవరైనా నాయకులు బయటకు వెళ్లాలని యత్నిస్తే అరెస్టు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమాలను కూడా సాగనివ్వకుండా ప్రభుత్వం పోలీసుల సహకారంతో అడ్డుకట్ట వేస్తోంది. పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీకి వినతి పత్రాలు ఇచ్చినా, కార్యక్రమాల నిర్వహణకు ముందుగా అనుమతులు అడిగినా ప్రభుత్వం కొవిడ్-19 నిబంధనలు సాకుగా చూపి ఇవ్వడం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అదే తెరాస నేతలు నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా కొవిడ్‌ నిబంధనలు అడ్డురావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెరాస నేతలుకాని, ప్రజాప్రతినిధులుకాని పార్టీ కార్యక్రమాలను, వ్యక్తిగత కార్యక్రమాలను నిర్వహించినా...ప్రభుత్వంకాని, పోలీసులుకాని ఎలాంటి ఆటంకాలు కలిగించడం లేదని ఉత్తమ్​ ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో, కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను... పోలీసులు అడ్డుకుంటున్నారని, ఈ అంశాలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఇవీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.