ETV Bharat / state

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ​- ఛాన్స్​ కొట్టేసింది వీరే! - addanki dayakar

Congress Announced MLA Quota MLC Candidates : తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. రెండు రోజుల పాటు తీవ్ర తర్జనభర్జన తర్వాత పార్టీ తుది నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ, అసెంబ్లీ టికెట్‌ దక్కకపోయినా అభ్యర్థుల గెలుపునకు పని చేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, యువత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వచ్చిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Congress MLC Candidates
Congress Party Announced MLC Candidates
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 5:52 PM IST

Updated : Jan 16, 2024, 8:07 PM IST

Congress Announced MLA Quota MLC Candidates : తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌లను హస్తం(Congress) అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరు అభ్యర్థులకు ఫోన్‌ కాల్‌ ద్వారా సమాచారం అందించినట్లు అభ్యర్థులు నిర్దారించారు. అయితే అధికారికంగా అభ్యర్థుల ఎంపిక ప్రకటనపై ఏఐసీసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌ రెడ్డి, కడియం శ్రీహరిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. డిసెంబర్‌ 9వ తేదీన వీరిద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినది కాగా, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కావడంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ దిశలోనే భర్తీకి కసరత్తు మొదలు పెట్టింది.

ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

ఈ రెండింటిని భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్​ కుమార్‌ గౌడ్‌, పటేల్‌ రమేశ్​ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, మాజీ ఎంపీ బలరామ్‌ నాయక్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, ప్రొటోకాల్‌ ఛైర్మన్‌ హర్కర్‌ వేణుగోపాల్​రావులు పోటీ పడ్డారు. అభ్యర్థుల ఎంపికలో పూర్తి స్థాయిలో చర్చించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం, పార్టీ కోసం వారు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుంది.

Congress MLC Candidates : మరోవైపు త్వరలో జరగనున్న లోక్​సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగింది. ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన నాయకులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినట్లయితే పార్లమెంటు ఎన్నికల్లో తాము నిలబడతామని చొరవ చూపడానికి అవకాశం ఉండదని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. పార్టీకి విధేయుడిగా, సీఎం రేవంత్​ రెడ్డికి దగ్గరగా ఉంటూ వచ్చిన అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్ దక్కింది.

చాలా కాలంగా విద్యార్థులు, యువత సమస్యల కోసం పోరాటం చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​కు ఎమ్మెల్సీ టికెట్​ కేటాయించింది. గతంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వెంకట్​ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ టికెట్‌ బల్మూరి వెంకట్​కు బదులు వేరొకరికి ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే, ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది.

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, పార్టీ అభ్యర్థుల గెలుపునకు పని చేయడం, విద్యార్థులు, యువత కోసం పోరాటాలతో పాటు న్యాయ పోరాటం కూడా చేశారు. అనేక కేసులు బల్మూరి వెంకట్​పై నమోదయ్యాయి. పార్టీకి విధేయుడిగా, వివాద రహితుడిగా ముద్రపడిన బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

Last Updated : Jan 16, 2024, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.