దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలోనే ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని ఓ ప్రైవేటు గార్డెన్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలు, మతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారని వివరించారు. గతంలో పండుగలు వచ్చాయంటే కర్ఫ్యూలతో ప్రజలు భయాందోళనకు గురయ్యేవారని అన్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెరాసలో తీర్థం పుచ్చుకున్నారు.
ఇవీ చూడండి : మేడిగడ్డ నుంచి అన్నారంకు నీటి విడుదల