ఇతర పార్టీలకు చెందిన మరికొందరు శాసనసభ్యులు రెండు, మూడు రోజుల్లో తెరాసలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ పార్టీలో చేరుతామని ప్రకటించారు. తాజాగా మరో ముగ్గురు శాసనసభ్యుల నుంచి అధికార పార్టీకి సంకేతాలు అందాయి. తన సతీమణికి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పీఠం ఇవ్వాలని ఒక ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఇంకో ఇద్దరు పరోక్షంగా పార్టీ మార్పిడి గురించి వాఖ్యలు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ముగ్గురు సీఎం కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ప్రతిపక్ష హోదాకే గండీ
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలు గెలిచింది. ఇందులో ఇప్పటికే 10 మంది తెరాసలో చేరుతామని ప్రకటించారు. మరో ముగ్గురు చేరితే ఈ సంఖ్య కాంగ్రెస్ బలంలో మూడింట రెండొంతులవుతుంది. హస్తం పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గల్లంతు చేయాలని తెరాస వ్యూహం పన్నుతోంది. సభలోని మొత్తం బలంలో పదో వంతు సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది.
ఇవీ చూడండి: మోగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా