రేపు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని... భద్రత దృష్ట్యా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 280 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాలొన్నారు. 250ఇళ్లను తనిఖీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. అలాగే 21 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి ,ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:'కశ్మీర్ ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నా'