తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన 584 మంది ఉద్యోగుల్లో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ సమ్మతి లేకుండానే ఏపీ నుంచి రిలీవ్ చేసి తెలంగాణకు కేటాయిస్తున్నారని పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. కేటాయింపుల సమస్య పరిష్కారానికే జస్టిస్ ధర్మాధికారి కమిటీ నియమించామని స్పష్టం చేశారు.
కేటాయింపులపై అభ్యంతరాలను జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముందే తేల్చుకోవాలన్న ధర్మాసనం.. పిటిషన్ను ఉపసంహరించుకోవాలని సూచించింది. దీంతో న్యాయస్థానం సూచనతో పిటిషన్ను న్యాయవాది ఉపసంహరించుకున్నారు.
ఇవీ చూడండి: మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్