ETV Bharat / state

టిమ్స్​లో వైద్య సేవలపై వీడియో... ట్వీట్​ చేసిన మంత్రి ఈటల

author img

By

Published : Apr 5, 2021, 5:32 AM IST

హైదరాబాద్​లోని టిమ్స్​ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై.. అక్కడ చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్న దంపతులు ప్రశంసలు కురిపించారు. మెరుగైన వైద్యం సహా, మనోధైర్యం కల్పించారంటూ వైద్యులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.. హైదరాబాద్​కు చెందిన రమేశ్​-మంజుల దంపతులు. వారు పంపిన వీడియోను మంత్రి ఈటల ట్వీట్​ చేశారు.

compliments to tims
టిమ్స్​లో వైద్య సేవలపై వీడియో

కొవిడ్​ రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టిమ్స్​ ఆస్పత్రిలో అందుతున్న సేవలపై హైదరాబాద్​కు చెందిన రమేశ్​, మంజుల దంపతులు.. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు టిమ్స్​ వైద్య సేవలపై వారు పంపిన వీడియోను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ట్వీట్​ చేశారు.

గత నెల 28న మాకు కొవిడ్​ సోకింది. సన్నిహితులు, వైద్యుల సలహాతో టిమ్స్​ ఆస్పత్రిలో చేరాం. కొవిడ్​ నుంచి కోలుకొని ఆదివారం డిశ్చార్జ్​ అయ్యాం. టిమ్స్​లో చాలా మంచి వైద్యం అందించారు. అక్కడి వైద్యులు తమకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంత మంచి వైద్యం దొరుకుతుందా అనిపించింది. కొవిడ్​ బాధితులకు ఉచితంగా మెరుగైన సేవలు అందిస్తోన్న టిమ్స్​ ఆస్పత్రి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

-- రమేశ్​ -మంజుల దంపతులు.

టిమ్స్​లో వైద్య సేవలపై వీడియో

ఇవీచూడండి: ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఉచిత ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.