వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్‌పై ఓ బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి రౌడీ షీటర్ అని వరంగల్ సీపీ బెదిరిస్తున్నారని బాధితుడు మాదాడి రఘుమారెడ్డి కమిషన్‌కు వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే తనను అక్రమ కేసులు పెట్టి భూకబ్జాదారుడిగా చిత్రీకరించారన్నారు. ఒకే కేసు విషయంలో తనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసులపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మళ్లీ తనపై పలు కేసులు నమోదు చేశారని అన్నారు.
కబ్జాదారులతో కుమ్మకై తన వ్యాపారానికి అడ్డుపడుతూ వరంగల్లో తనను ఉండనివ్వకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వ్యాపారం విషయంలో తనపై కక్షపురితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వరంగల్ సీపీ రవీందర్, ఏసీపీ జితేందర్, ఎస్సై వీరేందర్లతో పాటు పలువురు పోలీసుల నుంచి తనను రక్షణ కల్పించాలని హెచ్చార్సీని వేడుకున్నారు.
ఇదీ చూడండి : రికార్డు సృష్టించిన జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం