ETV Bharat / state

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​పై మరో ఫిర్యాదు - RAVIPRAKASH

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​పై మరో కేసు నమోదైంది. అలంద మీడియా సంస్థ​ అడ్మిన్ సాయి సుధీర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అలంద మీడియా సంస్థ అడ్మిన్‌ సాయి సుధీర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు
author img

By

Published : Jun 15, 2019, 6:04 AM IST

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​పై అలంద మీడియా సంస్థ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్​ వద్ద ఉన్న మూడు ఖరీదైన కార్లు సంస్థకు చెందినవని... సంస్థ నుంచి బయటకు వెళ్లినప్పటికీ.. వాటిని అప్పగించలేదంటూ అలంద మీడియా సంస్థ అడ్మిన్‌ సాయి సుధీర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటితో పాటు సంస్థకు చెందిన చరవాణులు, ల్యాప్‌టాప్‌లు ఇతర వస్తువులు కూడా రవిప్రకాశ్​ వద్ద ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 406 కింద కేసు నమోదు చేసుకొని.. బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్​ నివాసానికి వాహనాలు, చరవాణులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లారు. అక్కడున్న వాహనాలను పరిశీలించిన పోలీసులు రవిప్రకాశ్​కు నోటీసులు ఇవ్వాలని భావించి తిరిగి వెళ్లిపోయారు. కేసుకు సంబంధించి అలంద మీడియా సంస్థ నోటీసులు తమకు అందాయని దానికి తిరిగి సమాధానం ఇవ్వనున్నట్టు రవిప్రకాశ్​ కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాహనాలు తీసుకువెళ్లడానికి వీలు లేదని వారు అభ్యంతరం చెప్పగా.. పోలీసులు అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​పై కేసు నమోదు

ఇవీ చూడండి : 'కాంగ్రెస్​ కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.