మెదక్, నల్గొండ, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో చాలాచోట్ల తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు. ప్రతి కార్యాలయంలో మూడు పెట్టెలను తేదీల వారీగా తయారు చేసి ప్రత్యేక గదిలో భద్రపరుస్తున్నారు. అత్యవసరమైన దరఖాస్తులను మాత్రం స్కాన్ చేసి పంపించాలని సూచిస్తున్నారు.
‘‘మా మండలంలో రోజుకు పదికి పైగా దరఖాస్తులు వస్తుంటాయి. వీటికోసం ప్రత్యేకంగా పెట్టెను ఏర్పాటు చేశాం. దీనివల్ల బాధితులకు, సిబ్బందికి రక్షణ ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు వాట్సాప్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాను ప్రజలకు అందుబాటులో ఉంచాం’’ అని మెదక్ జిల్లా అల్లాదుర్గం తహసీల్దారు సాయాగౌడ్ తెలిపారు.
ఇదీ చదవండి- ఆయుధాల కొనుగోలులో సైన్యానికి అదనపు అధికారాలు!