అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా అభిప్రాయపడ్డారు. అఫ్ఘాన్‌లో పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూంభవన్‌లో డి.రాజా ఇవాళ మాట్లాడారు.
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజాస్వామ్య లౌకిక పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యత కనబడిందని రాజా తెలిపారు. ఇప్పటికే శరత్‌పవార్, కపిల్ సిబాల్ ప్రతిపక్షాల ఐక్యతపై సమావేశమయ్యారని పేర్కొన్నారు. ఈనెల 20న సోనియాగాంధీ నివాసంలో ప్రతిపక్షాల సమావేశంలో ఐక్యతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వివరించారు.
అఫ్గానిస్థాన్‌లో కాబుల్‌ను తాలిబన్లు వశపరుచుకున్నారు. తాలిబన్ల పాలన ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించే విధంగా ఉండాలి. భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే శరత్‌పవార్, కపిల్ సిబాల్ ప్రతిపక్షాల ఐక్యతపై భేటీ అయ్యారు.
- డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి
ఉగ్రవాద తండాలకు వెన్నుదన్నుగా నిలిచిన తాలిబన్ల చేతులకే అఫ్గానిస్థాన్ చిక్కింది. ఇరవై ఏళ్లు అమెరికా కనుసన్నల్లో నెట్టుకొచ్చిన అఫ్గాన్ ప్రజా ప్రభుత్వం చేతులెత్తేసింది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పలాయనంతో తాలిబన్లు ఏకపక్ష విజయం సాధించారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం సరిహద్దులు దాటేందుకు నరకం చవిచూస్తున్నారు. ప్రపంచం గుండెల్లో ఉగ్రబాంబులై పేలిన తాలిబన్ చరిత్రను తలుచుకుని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడుతోంది.
ఇవీ చదవండి:
- అఫ్గాన్‌లో యుద్ధం ముగిసింది.. తాలిబన్ల ప్రకటన
- విమానం రెక్కలపైకి ఎక్కిన అఫ్గాన్ ప్రజలు..!
- అఫ్గాన్ ప్రజల కళ్లముందు మెదులుతున్న క్రూర పాలన
- రాజకీయాల్లోకి మహిళలా? పగలబడి నవ్విన తాలిబన్లు!
- అఫ్గానీలకు అభయం- తాలిబన్ల కొత్త వ్యూహం
- యాక్షన్ సినిమాను తలదన్నేలా.. తాలిబన్ల నుంచి ఎస్కేప్!
- అఫ్గానిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా సలేహ్
- అఫ్గాన్‌పై మోదీ కీలక భేటీ- వారిని తీసుకురావాలని ఆదేశం!
- భారత్ కానుక తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!
- అఫ్గాన్ పార్లమెంటులో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు!