ETV Bharat / state

'ప్రజాఉద్యమం రాకముందే మేల్కొండి' - Communist Parties meeting at Baglingampally

రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు, అణిచివేతకు నిరసనగా వామపక్ష విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు సంయుక్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో నిర్భంద వ్యతిరేక సభను నిర్వహించాయి.

'ప్రజాఉద్యమం రాకముందే మేల్కొండి'
author img

By

Published : Oct 23, 2019, 9:03 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నవాబ్​ల వ్యవహరిస్తున్నారని.. ప్రజా తిరుగుబాటు రాకముందే తన వైఖరి మార్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అణిచివేతకు నిరసనగా వామపక్ష విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు సంయుక్తంగా హైదరాబాద్ బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్బంధ వ్యతిరేక సభ నిర్వహించారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణిచివేయటమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. సమ్మెలో నిర్మాణాత్మకమైన పోరాటం కొనసాగించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

'ప్రజాఉద్యమం రాకముందే మేల్కొండి'

ఇదీ చూడండి: "విలీనం" మినహా మిగతా డిమాండ్ల పరిశీలనకు కమిటీ

Intro:ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, అరెస్టులు, అణిచివేతకు నిరసనగా వామ పక్ష విప్లవ పార్టీలు , ప్రజా సంఘాలు సంయుక్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్బంధ వ్యతిరేక సభను నిర్వహించాయి.....

Body:రాష్ట్రం లో ముఖ్యమంత్రి కెసిఆర్ నవాబుల వ్యవహరిస్తున్నారని,, ప్రజా తిరుగుబాటు రాకముందే ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు..... రాష్ట్రంలో పరిస్థితులు అణిచివేతకు నిరసనగా వామపక్ష విప్లవ పార్టీలు,,ప్రజా సంఘాలు సంయుక్తంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయం లో నిర్బంధ వ్యతిరేక సభ నిర్వహించాయి.... దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రజా ఉద్యమాలను పని చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు..... రాష్ట్రంలో లో ఆర్టీసీ కార్మికులు కార్మిక చట్టాల ప్రకారం తమ సమస్యల సాధన కోసం పోరాటం కొనసాగిస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలతో ప్రకటన చేస్తూ ఆర్ టి సి సిబ్బంది ప్రాణాలను తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .....ప్రత్యేక రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది తీసుకొని పరిపాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు.... నేడు కార్మిక చట్టాలను కనుగుణంగా తమ సమస్యల కోసం పోరాటం చేస్తూ ప్రాణాలను ఫణంగా పెట్టి, ప్రస్తుతం 12 మంది ఆర్టీసీ కార్మికుల బలిదానాల పై సీఎం కేసీఆర్ స్పందించకుండా సమస్యను పరిష్కరించకుండా వారిని మనోవేదనకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..... పోరాటాలు తిరుగుబాటు దిశగా రాకముందే ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని,, ఈ నేపథ్యంలోనే వామపక్షాలు ఐక్యంగా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు..... ప్రధానంగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించాలని పరిస్థితి ఏర్పడిందని అందుకు నిర్మాణాత్మకమైన పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.... బైట్ ......నారాయణ సిపిఐ జాతీయ నేత

Conclusion:ప్రజా పోరాటాలను అనచి వేసి అరెస్టులతో నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలు వృధా ప్రయాస అని పలువురు నేతలు తెలిపారు......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.