ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ మేనిఫెస్టోకు కమిటీ ఏర్పాటు - జీహెచ్​ఎంసీ మేనిఫెస్టోకు కాంగ్రెస్​ ప్రత్యేక కమిటీ

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీని కాంగ్రెస్​ ప్రకటించింది. జీహెచ్​ఎంసీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్​గా మర్రి శశిధర్​రెడ్డి, కన్వీనర్​గా దాసోజు శ్రవణ్​కుమార్​ వ్యవహరించనున్నారు. వీరితో పాటు మరో 8 మంది సభ్యులకు కమిటీలో చోటు కల్పించారు. మరో పక్క పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పనివిభజన చేయడంతో పాటు వారికి పార్లమెంట్​ నియోజకవర్గాలను కేటాయించినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు.

committee organised by congress for ghmc election manifesto preparation
జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ మేనిఫెస్టోకు కమిటీ ఏర్పాటు
author img

By

Published : Nov 9, 2020, 10:13 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మేనిఫెస్టోను రూపొందించడానికి కమిటీని కాంగ్రెస్​ ఏర్పాటు చేసింది. జీహెచ్​ఎంసీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్​గా మర్రి శశిధర్​రెడ్డి, కన్వీనర్​గా దాసోజు శ్రవణ్​కుమార్​ ఉంటారు. వీరితో పాటు కోదండరెడ్డి, శ్యాంమోహన్, అంజన్​కుమార్​ యాదవ్, నిరంజన్​, కేతూరి వెంకటేష్, వెంకట్​ గురిజాల, మొగిళ్ల రాజిరెడ్డిలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నవంబర్​ 21 లోపు 500 పేజీల ప్రజల మేనిఫెస్టేను రూపొందిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో రూపొందించిన రెండు రోజులకు కాంగ్రెస్​ రాష్ట్ర బాధ్యులు మణికం ఠాగూర్​ విడుదల చేస్తారని ఉత్తమ్ పేర్కొన్నారు.

నలుగురు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు పనిని విభజించడంతో పాటు పార్లమెంట్​ నియోజకవర్గాలను కేటాయించి.. వాటిని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తమ్ వివరించారు.

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పార్లమెంట్ నియోజకవర్గాల కేటాయింపు
రేవంత్​రెడ్డి ఆదిలాబాద్(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ), కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్ (ఎస్టీ)
పొన్నం ప్రభాకర్ మెదక్, మల్కాజిగిరి, హైదరాబాద్, చేవెళ్ల, ఖమ్మం
కుసుమకుమార్​ మహబూబ్​నగర్, నాగర్​కర్నూలు(ఎస్సీ), నల్గొండ, భువనగిరి, వరంగల్​(ఎస్సీ)
మహ్మద్ అజారుద్దీన్ అన్ని ఎన్​ఎస్​యూఐ యూత్​ కాంగ్రెస్, సేవాలాల్​ విభాగాలతో పాటు మహిళా, కిసాన్​సెల్, మిగతా డిపార్ట్​మెంట్లు

ఇదీ చదవండిః ఖాతాలోని నగదు తీయాలంటే.. కాసులు చెల్లించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.