ETV Bharat / state

TSPSC: రద్దయిన పరీక్షలకు త్వరలోనే కొత్త తేదీల ప్రకటన..! - Policy on Cyber Security

TSPSC Exams New Schedule: పేపర్​ లీకేజీతో రద్దయిన వివిధ పోస్టులకు సంబంధించి కొత్త షెడ్యూల్​ను టీఎస్​పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే గ్రూప్​-1 పరీక్ష ప్రాథమిక పరీక్షను జూన్​ 11న జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్న కమిషన్.. రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను వారం రోజుల్లో ప్రకటించనుంది.

TSPSC
TSPSC
author img

By

Published : Mar 25, 2023, 12:02 PM IST

TSPSC Exams New Schedule: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూల్​ను కమిషన్​ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష రద్దు చేసిన రోజునే పునః పరీక్ష తేదీని జూన్‌ 11గా టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అయితే గ్రూప్‌-1తో పాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను కమిషన్​ ప్రకటించనుంది. కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా విడుదల చేయనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలకు మధ్య కాల వ్యవధిని పరిగణలోకి తీసుకొని ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

ప్రొఫెషనల్‌ పోస్టులకు సీబీఆర్‌టీ పరీక్షలు: పోటీ పరీక్షలు మరింత భద్రతతో పాటుగా ఫలితాలు వేగంగా వెల్లడించేందుకు వీలుగా.. తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న నోటిఫికేషన్లకు కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహిస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన హార్టికల్చర్‌ అధికారులు, భూగర్భజల అధికారులు, లైబ్రేరియన్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పరీక్షలను యధావిధిగా నిర్వహించాలా అనే దానిపై ఆలోచన చేస్తోంది. ఆలోగా కొత్త ప్రశ్నాపత్రాలు సిద్ధం అవుతాయా? తదితర విషయాలను టీఎస్​పీఎస్సీ పరిశీలిస్తోంది. అవసరమైతే వారం నుంచి 15 రోజుల వ్యవధితో వీటిని రీషెడ్యూలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలన్నీ సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ యోచిస్తోంది.

ఇప్పటికే ఏఈఈ పోస్టులకు 81 వేల మంది, ఏఈ పోస్టులకు 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పోస్టుల్లో వివిధ కేటగిరీలు ఉన్నందున.. ఆయా విభాగాల వారీగా సీబీఆర్‌టీ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని కమిషన్​ ఆలోచిస్తోంది. గ్రూప్స్​ ఉద్యోగాలకు సీబీఆర్‌టీ పద్ధతిలోనే విడతల వారీగా పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. నార్మలైజేషన్‌ విధానంలో మార్కులను లెక్కించే విధానంపై పరిశీలించి.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు తది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

సైబర్‌ సెక్యూరిటీ విధానం: టీఎస్‌పీఎస్సీలో సైబర్‌ సెక్యూరిటీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కమిషన్‌ ప్రయత్నిస్తోంది. వారం రోజులుగా ఐఐటీ హైదరాబాద్‌, జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీల ఐటీ విభాగాధిపతులు, సైబర్‌ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమై.. పలు సూచనలు స్వీకరించింది. సీబీఆర్‌టీ విధానంలో పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్‌ వ్యవహారాలు, సైబర్‌ సెక్యూరిటీ, అలర్ట్‌ సిస్టమ్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టింది. చేయాల్సిన మార్పులు, భద్రత విషయాలపై సూచనలు తీసుకుంది.

ఇవీ చదవండి:

హామీల అమలు పర్యవేక్షణ విధానమేంటో చెప్పాలి: హైకోర్టు

TSPSC లీకేజీ వ్యవహారం.. ప్రశ్నాపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయి?

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో 19 మందిని సాక్ష్యులుగా నమోదు చేసిన సిట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.