పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో నేడు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వివరించారు.
ఆదివారం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించి.. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉండి స్థిరంగా కొనసాగుతుందని నాగరత్న తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: DH: 'రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్... వైద్య సౌకర్యాల కొరత లేదు'