కరోనా వైరస్ నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టులో అత్యవసర కేసులనే విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు సివిల్ కోర్టు ముఖ్య న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31 వరకు అత్యవసర కేసులను మాత్రమే విచారించనున్నారు. పిటీషనర్లు, న్యాయవాదులు, సాక్ష్యులు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చీఫ్ జడ్జి సూచించారు. వాద ప్రతివాదులు కూడా అత్యవసరమని భావిస్తే తప్ప న్యాయస్థానానికి రావొద్దని చెప్పారు. కేసు వాయిదా గురించి ఈ కోర్టు వెబ్సైట్లో చూసుకోవాలని ఆయన సూచించారు.
ఇదే కోవలో లోకాయుక్త, ఉప లోకాయిక్త...
లోకాయుక్త , ఉప లోకాయుక్త కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల 31 వరకు కేవలం అత్యవసర ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని లోకాయుక్త రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఫిర్యాదుదారులు రావొద్దన్నారు. తప్పనిసరి అనుకుంటే లోకాయుక్త కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చని లోకాయుక్త రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.