ETV Bharat / state

Drainage water: ఏడాదిగా రోడ్డుపైకే మురుగు నీరు..

రోడ్డుపై మురికి నీటితో బాచుపల్లి నుంచి గండిమైసమ్మ చౌరస్తా దారిలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఏడాదిగా ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

colony people facing problems with Drainage water on roads in nizampet municipal corporation
ఏడాదిగా రోడ్డుపైకే మురుగు నీరు..
author img

By

Published : Jun 18, 2021, 6:27 PM IST

హైదరాబాద్​ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి నుంచి గండిమైసమ్మ చౌరస్తాకు వెళ్లే రహదారిపై మురుగు నీరు నిలిచి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డులో పలు భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే.. నిర్మాణ సంస్థలు వారి కార్మికుల కోసం తాత్కాలిక గదులు నిర్మించాయి. కానీ వాటి నుంచి వచ్చే మురుగు నీరు వెళ్లేందుకు మాత్రం ఏర్పాట్లు చేయలేదు. దాని వల్ల ఆ నీరంతా రోడ్డుపై నిలుస్తోంది. దీనికి తోడు వర్షం కురిస్తే ఆ ప్రాంతమంతా దుర్గంధంగా, మురికిగా మారుతోంది.

ఏడాదిగా ఉన్న ఈ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలూ సజావుగా సాగక.. ట్రాఫిక్​జాం ఏర్పడుతోంది. డ్రైనేజీ నీటిని రహదారిపైకి వదులుతున్న నిర్మాణ సంస్థలపై పురపాలక అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా... అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. తమ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.