Lady Aghori Naga Sadhu Halchal In Mangalagiri : ఓ లేడీ అఘోరి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం కనిపించారు. నడిరోడ్డుపై హల్చల్ చేస్తూ కనిపించిన వారందరిపై త్రిశూలంతో దాడికి పాల్పడ్డారు. 16వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, సుమారు 25 ఏళ్ల మహిళా అఘోరి పట్టణ శివార్లలో ఉన్న కార్ వాష్ దగ్గరకు వచ్చి కార్‌ను శుభ్రం చేయాలని కోరారు. ఈ లోగా ఆమెను చూసేందుకు అధిక సంఖ్యలో స్థానికులు రాగా, పోలీసులూ అక్కడికి చేరుకున్నారు.
పోలీసులపై దాడి : ఈ క్రమంలోనే సెల్ఫోన్లో వీడియోలు తీసేందుకు ప్రయత్నించిన పలువురిపై ఆమె దాడికి పాల్పడ్డారు. త్రిశూలంతో దాడి చేయడంతో నులకపేటకు చెందిన యువకుడు రాజు కాలు విరిగింది. అంతటితో ఆగని ఆ మహిళా అఘోరి రహదారి పైకి ఎక్కి తన వెనక వచ్చే వారి వెంటపడి దాడికి యత్నించారు. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు రోడ్డు డివైడర్‌పై ఉన్న చెట్లల్లో పడ్డారు. పోలీసులు అతి కష్టంపై ఆమె చేతిలోని త్రిశూలాన్ని తీసుకున్నారు. దీంతో మహిళా పోలీసులు సహా ఇతరులపై చేతులతోనే ఆమె దాడికి దిగారు.
డబ్బు ఆశతో క్షుద్రపూజలు, భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి
ఘటనలో సీఐ, మరో ఎస్సై, కొంతమంది కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఇలా హైదరాబాద్ విజయవాడ మార్గంలో దాదాపు రెండున్నర గంటలు ఆ అఘోరి హల్చల్ చేశారు. కొంతమంది యువకులు ఆమెకు నచ్చజెప్పి వస్త్రాన్ని శరీరానికి కట్టారు. అనంతరం ఆమె తిరిగి దాడికి ఉపక్రమించడంతో పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోని ఎక్కించి విజయవాడ వైపు పంపించారు. స్టేషన్‌కు తరలించి కాసేపు సముదాయించి ఆమెను విడిచిపెట్టారు.