ETV Bharat / state

కల్నల్​ సంతోష్​ బాబు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం - ts news

Colonel Santhosh jayanthi: హైదరాబాద్​లోని చందానగర్​లో కల్నల్ సంతోష్ బాబు జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​, కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు.

కల్నల్​ సంతోష్​ బాబు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

author img

By

Published : Feb 12, 2022, 6:36 PM IST

Colonel Santhosh jayanthi: హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం భాజపా పార్టీ నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చందానగర్​లో కల్నల్ సంతోష్ బాబు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్​, కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల సేవలకు ప్రతి వ్యక్తి సెల్యూట్ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. వీరమరణం పొందిన సంతోష్ బాబుకు నివాళిగా భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

కల్నల్​ సంతోష్​ బాబు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది. ఇటువంటి సేవాకార్యక్రమాలు భవిష్యత్​లో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరవ్వాలని రవియాదవ్​కు అభినందనలు తెలియజేస్తున్నాను.

-ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.