కొత్త రెవెన్యూ చట్టం ప్రధాన ఎజెండాగా ఈరోజు, రేపు కలెక్టర్ల సమావేశం జరగనుంది. ప్రగతి భవన్ వేదికగా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో, భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన పాలనాధికారుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చట్టం ఉండాలంటే ఎలాంటి నిబంధనలు రూపొందించాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
క్షేత్రస్థాయిలో అనుభవంలో ఉన్న విషయాలను కలెక్టర్ల నుంచి తెలుసుకోవడమే కాకుండా కొత్త చట్టం రూపకల్పనలో వారి నుంచి సూచనలను తీసుకోనున్నారు. కొత్త పురపాలక చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుపై సమావేశంలో చర్చిస్తారు. పల్లెలు, పట్టణాలలో అమలు చేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా కలెక్టర్లతో సీఎం చర్చించి దిశానిర్దేశం చేస్తారు.
ఇదీ చూడండి: త్వరలో బొకేలకు ప్లాస్టిక్ వాడకంపై నిషేధం