ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నూతిమడుగు సమీపంలో పెన్నా నదిపై నిర్మించిన కాజ్ వే పూర్తిగా కూలిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ధర్మవరం-కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై నూతిమడుగు సమీపంలో నిర్మించిన ఈ కాజ్వే ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిని.. చిన్నచిన్న వాహనాలు వెళ్ళటానికి మాత్రమే వీలుగా ఉండేది. తాజాగా కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం అధికమై పూర్తిగా కూలిపోవడంతో ప్రయాణికుల రాకపోకలు స్తంభించిపోయాయి.
కాజ్వే కూలిపోవడంతో పెన్నా నదికి ఇరువైపులా ఉన్న రైతులు తమ వ్యవసాయ పనుల కోసం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తాత్కాలిక రహదారినైనా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: