ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్.. సికింద్రాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన నాగమణి (సీతాఫల్‌మండీ), శంకర్ రావు (షాబాజ్ గూడా)లకు.. సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
కుటుంబసభ్యుల వైద్య చికిత్సకోసం చెరో రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి.. లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు.. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని పద్మారావు వివరించారు.
ఇదీ చదవండి: అమల్లోకి రాత్రి కర్ఫ్యూ.. మే 1 వరకు ఆంక్షలు