ETV Bharat / state

'అప్పుడే మిషన్​ భగీరథ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరినట్లు' - తెలంగాణ వార్తలు

ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేస్తున్న మిషన్​ భగీరథ నీరు మార్కెట్​లో లభించే తాగునీటి కంటే సురక్షితమని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​ పేర్కొన్నారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈలతో హైదరాబాద్ ఎర్రమంజిల్​లో సమీక్ష నిర్వహించారు.

'అప్పుడే మిషన్​ భగీరథ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరినట్లు'

author img

By

Published : Nov 11, 2020, 7:58 PM IST

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు అందినప్పుడే ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరినట్లవుతుందని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్​ అన్నారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈలతో హైదరాబాద్ ఎర్రమంజిల్​లో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా నీటి సరఫరా తీరును సమీక్షించారు. గ్రామాల్లో జరుగుతున్న స్థిరీకరణ పనుల పురోగతిని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి అమ్రాబాద్ వరకు ఉన్న ఆదివాసీ గూడాలు, లంబాడా తండాలకు మిషన్ భగీరథతో రక్షిత మంచినీరు అందుతోందని అన్నారు.

రైతువేదికలు, వైకుంఠధామాలకు కూడా మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ వాటర్ బాటిల్​లను వినియోగించిన అధికారులను స్మితా సబర్వాల్ అభినందించారు. ఇక నుంచి మిషన్ భగీరథ కార్యక్రమాలు, సమావేశాల్లో కచ్చితంగా భగీరథ బాటిల్ నీటినే వాడాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వంటనూనెల ధరలపై కరోనా ప్రభావం.. సామాన్యుడికి చుక్కలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.