NPDCL notification is false: ఎన్పీడీసీఎల్‌లో పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేశారని వస్తున్న వార్తలను ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు ఖండించారు. దీనికి సంబంధించిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. ఎన్పీడీసీఎల్‌లో ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఇటువంటి అసత్య వార్తలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు.
![CMD Gopal Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17385629_npdcl2.jpg)
157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా కల్పితమని.. అభ్యర్థులు ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని కోరారు. కేవలం ఆడిట్ కోసం చార్టెర్డ్ అకౌంటెంట్ సంస్థల సేవల కోసం మాత్రమే ప్రకటన ఇచ్చినట్లు సీఎండీ వివరణ ఇచ్చారు. కొందరు 157 ఆడిట్ యూనిట్లను 157 పోస్టులుగా వక్రీకరించారని వివరించారు. ఇటువంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ అధికారిక వెబ్సైట్ చూసి నిర్ధారించుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: