ETV Bharat / state

'పాతబస్తీలో ఆలయ భూముల పరిరక్షణకు 24గంటల డెడ్​లైన్' - ఆలయా భూముల కబ్జాపై రాజాసింగ్​ ఫైర్​

తమ ఓపిక వల్లే ఇవాళ పాతబస్తీ ప్రశాంతంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. 24 గంటల్లోగా ఆలయాల భూముల పరిరక్షణపై సీఎం స్పందించకపోతే తమ ఉద్యమానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

bandi sanjay
పాతబస్తీలో ఆలయ భూముల పరిరక్షణపై సీఎం స్పందించాలి: సంజయ్‌
author img

By

Published : Dec 16, 2020, 8:34 PM IST

పాతబస్తీలో ఆలయాల భూముల పరిరక్షణపై ముఖ్యమంత్రి స్పందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. దేవాలయ భూములు కాపాడాలని కోరిన తమ కార్యకర్తలను అరెస్ట్​ చేశారని.. వారిని కలవడానికి వెళితే డీసీపీ అడ్డుకున్నారని బండి అన్నారు. సాక్షాత్తు డీసీపీ కబ్జాదారులకు కొమ్ముకాశారని సంజయ్​ ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం, డీజీపీ స్పందించాలని డిమాండ్​ చేశారు. ఆ కబ్జా భూములను స్వాధీనం చేసుకుని దేవాదాయ శాఖకు అప్పగించాలన్నారు. పోస్టింగ్, అవార్డు, రివార్డుల కోసం భాజపా కార్యకర్తలను నిలువరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇవాళ తమ ఓపిక వల్లే పాతబస్తీ ప్రశాంతంగా ఉందని.. 24 గంటల్లో పాతబస్తీలోని దేవాలయ భూముల పరిరక్షణపై ముఖ్యమంత్రి స్పందించని పక్షంలో భాజపా చేసే ఉద్యమానికి.. బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్​ స్పష్టం చేశారు.

ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్..

పాతబస్తీలో కాళీమాత ఆలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు మజ్లిస్‌ యత్నిస్తోందని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. మూడుసార్లు ఆక్రమించేందుకు యత్నిస్తే భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. పాతబస్తీలోని నాలాలు, చెరువులు కబ్జా అయ్యాయన్నారు. దేవాలయ స్థలాలు కాపాడేందుకు వెళ్లిన తమ పార్టీ కార్యకర్తలను, మహిళలను పోలీసులు కొట్టారని.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్​ అని ప్రశ్నించారు. ఆలయాల భూములు అన్యాక్రాంతమైతే సహించేది లేదని.. ఒక్క ఇంచు కబ్జా చేసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

పాతబస్తీలో ఆలయ భూముల పరిరక్షణపై సీఎం స్పందించాలి: సంజయ్‌

ఇవీచూడండి: డబిర్‌పురలో ఉద్రిక్తత... ఎంఐఎం, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.