సచివాలయ తరలింపు కసరత్తు వేగవంతమవుతోంది. వీలైనంత త్వరగా కార్యాలయాలను పూర్తి చేయాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. తరలింపు ప్రణాళికలపై ఇవాళ సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులు పలు అంశాలపై చర్చించారు.
సచివాలయ తరలింపు ప్రణాళికా ముసాయిదాతో పాటు, కొన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై మంతనాలు జరిపారు. ఏ శాఖను ఎక్కడికి తరలించాలన్న విషయమై వివిధ ప్రతిపాదనలు రూపొందించారు. సచివాలయ తరలింపు ప్రణాళికలపై రేపు సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు.
ఇవీ చూడండి : పోడు భూములపై ముఖ్యమంత్రి హామీ ఏమైంది