CM Revanth Reddy Review on Irrigation Issues Today : నీటిపారుదల అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పనులు, వాటి పురోగతి, సమస్యలు, తదుపరి కార్యాచరణపై ఆయన సమీక్షించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపిస్తామని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం లేఖ రాసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
CM Revanth Reddy Review Meeting on Irrigation Department : దీంతో పాటు మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభించింది. నిన్నటి నుంచి సంబంధిత కార్యాలయాల్లో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ఇవాళ్టి సమీక్షలో చర్చ జరగనుంది. మేడిగడ్డ ఆనకట్టలో కుంగిన పియర్స్ సహా ఇతరత్రాలకు సంబంధించి మరమ్మతులు, తదుపరి కార్యాచరణపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికలకు ముందు ప్రారంభించిన పనుల టెండర్లపై చర్చ : తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అందుకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project ) పనులు, పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. ఎన్నికలకు ముందు ప్రారంభించిన పనుల టెండర్లు సహా ఇతర అంశాలపై సమీక్షించి ఓ నిర్ణయానికి రానున్నారు.
వీటితో పాటు సీతారామ, ఎస్‌ఎల్‌బీసీ తదితర ప్రాజెక్టుల పురోగతిపై కూడా సీఎం చర్చించే అవకాశం ఉంది. జలాశయాల్లో నీటిలభ్యత, వేసవి అవసరాలను కూడా సమీక్షించే అవకాశం ఉంది. మరోవైపు వేసవిలో తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేయాలని కర్ణాటక రాష్ట్రాన్ని రాష్ట్రప్రభుత్వం కోరేందుకు సిద్ధమవుతోంది.
Revanth Reddy Review Meeting on Irrigation ఇటీవలే రేవంత్‌రెడ్డి సాగునీటి సాగునీటి రంగంపై సమీక్ష నిర్వహించారు. సాగునీటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు తేలాల్సిందేనని రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని అన్నారు. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతి అంశాన్ని ప్రజలకు విడమరిచి చెబుతున్నామని అన్నారు. ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి నిజాలను ప్రజలకు వివరించాలని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి - కేంద్రానికి సీఎం విజ్ఞప్తి
హైదరాబాద్ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్ - మూసీ నది అభివృద్ధే ప్రధానం