ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం - యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల కమిషన్ల అధ్యయనానికి ఆదేశం - TSPSC Chairman Janardhan Reddy Resign

CM Revanth Reddy Review Meeting on TSPSC : టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల కమిషన్ల గురించి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీఎస్​పీఎస్సీ నిర్వహణపై ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించారు. అలాగే పదో తరగతి, ఇంటర్​ పరీక్షల నిర్వహణపై సైతం రివ్యూ జరిపారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Review Meeting on TSPSC
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 2:53 PM IST

Updated : Dec 12, 2023, 9:17 PM IST

CM Revanth Reddy Review Meeting on TSPSC : రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్సీ విధానంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల పబ్లిక్​ సర్వీస్​ కమిషన్లపై అధ్యయనం చేయాలని, సమగ్ర అధ్యయం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. నియామకాలు పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఛైర్మన్​, సభ్యుల నియామకాలు పారదర్శకంగా జరగాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులకు సూచించారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీపై సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీసు ఉన్నతాధికారులు, కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, ఛైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాల గురించి సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ఆరా తీశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు చేసిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. గ్రూప్ 1, ఏఈఈ, తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు.

కేసు పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణ సహా అన్ని అంశాల గురించి పోలీసుల ఉన్నతాధికారుల ద్వారా సీఎం తీసుకున్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పరిస్థితులకు అనుగుణంగా కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ జనార్దన్​ రెడ్డి అంశంపై కూడా సమీక్షలో రేవంత్​ రెడ్డి అడిగారు. అలాగే పదో తరగతి, ఇంటర్​ పరీక్షల నిర్వహణపై సైతం సమీక్ష జరిపారు. టీఎస్​పీఎస్​ ఛైర్మన్​ రాజీనామా చేయగానే అశోక్​ నగర్​లో ఉన్న నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఒకరిని ఒకరు పరస్పరం కౌగిలించుకుంటూ మిఠాయిలు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు.

TSPSC Chairman Janardhan Reddy Resign : సోమవారం సీఎం రేవంత్​ రెడ్డితో సమావేశం అయిన తర్వాత టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ జనార్దన్​ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే ఆ రాజీనామాను గవర్నర్​ ఆమోదించినట్లు వార్తలు నెట్టింట​ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై రాజ్​భవన్​ వర్గాలు స్పందిస్తూ జనార్దన్​​ రెడ్డి రాజీనామాను ఆమోదించలేదని చెప్పారు. అలాంటి అవాస్తవ వార్తలను నమ్మవద్దని తెలిపారు. ఇంకా టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ రాజీనామాను గవర్నర్ తమిళి సై​ ఆమోదించలేదని రాజ్​భవన్​ తెలిపింది. పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్​కు అన్ని వివరాలు పంపించామన్నారు. ఇంకా జనార్దన్​​ రెడ్డి రాజీనామా లేఖ గవర్నర్​ పరిశీలనలో ఉందని రాజ్​భవన్​ వర్గాలు తెలుపుతున్నాయి.

గతంలోనే రాజీనామా చేయాల్సింది కానీ : గత ప్రభుత్వం హయాంలో టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​గా జనార్దన్​ రెడ్డి ఉండగానే గ్రూప్​-1 సహా పలు రకాల పోటీ పరీక్షల పేపర్​ లీకేజీకు గురయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయంపై పెద్ద చర్చనే జరిగింది. పబ్లిక్​ కమిషన్​లోని ఉద్యోగులే ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు సుమారు 80 మంది ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా పాల్గొని, జైలుల్లో ఉన్నారు. ఈ క్రమంలో పబ్లిక్​ కమిషన్​ ఛైర్మన్​గా జనార్దన్​ రెడ్డి రాజీనామాకు అప్పటి నుంచే ఆందోళనలు జరిగాయి. అయితే ఆయన రాజీనామా చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ముఖ్యమంత్రిని కలిసిన తరువాత తన పదవికి రాజీనామా చేశారు.

ప్రజా దర్బార్ ఇకపై ప్రజావాణి - టైమింగ్స్ ఇవే

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా - అశోక్​నగర్​లో నిరుద్యోగుల సంబురాలు

Last Updated : Dec 12, 2023, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.