ETV Bharat / state

ఆర్​ఆర్​ఆర్​ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy Instructions rrr

CM Revanth Reddy on Regional Ring Road : రాష్ట్రంలో రీజినల్​ రింగ్​ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్​ఆర్​ఆర్​ భూ సేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని తెలిపారు. ఈ పనులు నిర్మాణానికి ఎంత ఆర్థిక భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Telangana Government Financial Support to RRR
CM Revanth Reddy on Regional Ring Road
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 11:00 PM IST

CM Revanth Reddy on Regional Ring Road : హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు అసరమైన భూసేకరణ మూడు నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్తరం వైపు ఆర్ఆర్ఆర్ కోసం భూసేకరణతో పాటే టెండర్లు కూడా పిలవాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే రవాణా సదుపాయాలు పెరగడంతో పాటు సెమీ అర్బన్ జోన్​లో కొత్త పరిశ్రమలు రావడానికి దోహదపడుతుందన్నారు.

డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడితో రేవంత్‌ భేటీ - సీ4ఐఆర్‌ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన

Telangana Government Financial Support to Regional Ring Road : భారత్​మాల పరియోజన మొదటి దశలో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరాన 158 కిలోమీటర్ల మేరకు తలపెట్టారని రేవంత్​ రెడ్డి గుర్తు చేశారు. 1935 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1459 హెక్టార్లు పూర్తయిందన్నారు. భూసేకరణకు రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముడుల వలన తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు(Regional Ring Road)ను పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ఏ పనయినా చేపట్టేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందన్నారు.

కొనసాగుతోన్న పెట్టుబడుల వేట - దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్​ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Revanth Reddy Davos Tour Details : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డితో సహా బృందం ఈ నెల 15 నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా బృందం ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశం అవుతోంది. ఇప్పటికే వరల్డ్​ ఎకనామి ఫోరమ్ అధ్యక్షుడుతో రేవంత్​ రెడ్డి చర్చించారు. హైదరాబాద్​లో నాలుగో పారిశ్రామిక విప్లవం సదస్సు జరగనుందని ప్రకటించారు. ఈ సమావేశంలో సీఫోర్​ఐఆర్ ప్రారంభం కానుంది. ​సదస్సు కోసం దావోస్ వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సీఈవోలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం(Revanth Reddy Team) చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర కంపెనీ ప్రతినిధులతో సీఎం కలవనున్నారు. అనంతరం సీఎం రేవంత్​ రెడ్డి లండన్​ పర్యటన చేయనున్నారు. మూసీ నది అభివృద్ధి కోసం థేమ్స్​ నది నమూనాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రముఖ వ్యక్తులతో చర్చించనున్నారు.

భారీ పెట్టుబడులే టార్గెట్ - నేటి నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.