CM Revanth Reddy on New Power Policy in Telangana : రాష్ట్రంలో త్వరలోనే నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగ నిపుణులు, ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. శాసనసభలో చర్చించి కొత్త విద్యుత్ విధానం అమలు చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు సరైన విద్యుత్ పాలసీ(Telangana New Power Policy) లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి విద్యుత్ రంగంపై రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ఖరారు - ఈనెల 15న జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు
CM Revanth Reddy Review Meeting on Power Policy : రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి, కొనుగోళ్లు, వినియోగం, నిరంతర సరఫరా, గృహజ్యోతి పథకం అమలుకు చర్యలు, డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై సమీక్షలో సీఎం చర్చించారు. రాష్ట్రావిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ ఒప్పందాల(Electricity contracts in Telangana)పై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కువ ధరకు చెల్లించేలా జరిగిన ఒప్పందాలకు కారణాలను కూడా నివేదికలో పొందుపరచాలన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు ఇచ్చే కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ బృందం
CM Revanth Reddy on Six Guarantees : ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy Review Meeting) ఆదేశించారు. ప్రభుత్వ పరంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నాణ్యతను పెంచాలని సీఎం చెప్పారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, సాగునీటి పారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా, ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ ఫారూఖీ, సీఎంఓ అధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్ - మూసీ నది అభివృద్ధే ప్రధానం