CM Revanth Reddy Camp Office : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1996లో ఇన్‌స్ట్యూట్ ఆఫ్ అడ్మినిస్టేషన్ పేరున ఈ సంస్థ ఏర్పాటైంది. ఆ తర్వాత 1998లో దానిని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా మార్చారు. ఇది మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. క్లాస్‌రూమ్, ఇ-లెర్నింగ్ మోడ్‌లు రెండింటినీ ఉపయోగించి శిక్షణను ఇవ్వడం ఈ ఇన్‌స్టిస్ట్యూట్ ప్రత్యేకత. ఇక్కడ సమర్ధవంతంగా, అంకితభావంతో కష్టపడి పనిచేసే బృందం ఉంది. దీని అధ్యాపక వనరులలో సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, రాష్ట్ర అధికారులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ మొదలైన వివిధ ఉన్నత విద్యా సంస్థల నుంచి ప్రముఖ అధ్యాపకులు కూడా ఉన్నారు.
ఈ సంస్థ హైదరాబాద్ నడిబొడ్డున విశాలమైన క్యాంపస్‌ని కలిగి ఉంది. ఇది పూర్తిగా వైఫై (WIFI) ఎనేబుల్, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్‌తో కలిగిన భవనాలు. ఇక్కడ 900 మంది వ్యక్తులకు వసతి కల్పించే సామర్థ్యంతో స్విమ్మింగ్ పూల్, హాస్టల్ బ్లాక్‌లతో సహా చక్కగా అమర్చబడిన తరగతి గదులు, ఆడిటోరియంలు, ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఏకంగా 375 సెంట్రల్ ఏసీ గదులు, మరో 15 గదులతో అతిథి గృహం, 150 మంది కూర్చునే నాలుగు కాన్ఫరెన్స్ హాళ్లు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి మంజరీ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి.
ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి - అక్కడి కార్యకలాపాలపై ఆరా
CM Revanth Reddy Camp Office At MCR HRD : గత ప్రభుత్వంలో తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతిభవన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చింది. ప్రస్తుతం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఎంసీఆర్హెచ్ఆర్డీని సందర్శించారు. అక్కడ ఫ్యాకాల్టీతో సమావేశమై అక్కడ ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత సోలార్ విద్యుత్‌తో నడిచే వాహనంలో ప్రాంగణం అంతా తిరిగి నిర్మాణాలను అన్నింటిని పరిశీలించారు.
MCR HRD Building as CM Camp Office : అక్కడకి క్యాంపు కార్యాలయం మార్చినట్లయితే బహుళ ప్రయోజనాలు ఉంటాయని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సీఎం క్యాంపు కార్యాలయంగా దానిని ఎంచుకున్నట్లయితే ఇప్పటి వరకు అక్కడ సాగుతున్న కార్యకలాపాలకు ఆటంకం కలుగకుండా ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి అక్కడ భవనాలను పరిశీలించడం, అధికారులతో సమీక్ష చేయడం, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకోవడంతో అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తారని సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.
ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : దామోదర్ రాజనర్సింహా
కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరాను: రేవంత్ రెడ్డి