CM Revanth Reddy Agreement with Adani Group in Davos : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో సహా అతని బృందం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటనలో బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్తలతో రాష్ట్ర పెట్టుబడుల గురించి చర్చిస్తున్నారు. రాష్ట్రంలో అవసరాలను, అనుకూలతలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ అయిన అదానీ గ్రూప్‌తో కీలక ఒప్పందం జరిగింది. రూ. 12,400 కోట్లకు పైగా అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీలతో 4 అవగాహన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
- గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ.5000 కోట్లు
- డేటా సెంటర్ విభాగంలో రూ.5000 కోట్లు
- ఏరోస్పేస్ అండ్ రక్షణ విభాగంలో రూ.1000 కోట్లు
- అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్లో రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎమ్ఓయూలు కుదిరాయి.
-
Chief Minister Sri @revanth_anumula, along with Industries Minister Sri @Min_SridharBabu, met with Sri @gautam_adani, Chairman @AdaniOnline on the sidelines of @wef's 54th Annual Meeting in #Davos.
— Telangana CMO (@TelanganaCMO) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
The hour-long meeting covered a plethora of exciting new business opportunities… pic.twitter.com/9JfclrKnnL
">Chief Minister Sri @revanth_anumula, along with Industries Minister Sri @Min_SridharBabu, met with Sri @gautam_adani, Chairman @AdaniOnline on the sidelines of @wef's 54th Annual Meeting in #Davos.
— Telangana CMO (@TelanganaCMO) January 16, 2024
The hour-long meeting covered a plethora of exciting new business opportunities… pic.twitter.com/9JfclrKnnLChief Minister Sri @revanth_anumula, along with Industries Minister Sri @Min_SridharBabu, met with Sri @gautam_adani, Chairman @AdaniOnline on the sidelines of @wef's 54th Annual Meeting in #Davos.
— Telangana CMO (@TelanganaCMO) January 16, 2024
The hour-long meeting covered a plethora of exciting new business opportunities… pic.twitter.com/9JfclrKnnL
-
భారీ పెట్టుబడులే టార్గెట్ - నేటి నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన
Adani Investment in Telangana : అదానీ ఎంటర్ ప్రైజెస్ చందనవెల్లిలో రూ.5000 కోట్లతో 100 మెగా వాట్ల డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో రూ.5 వేల కోట్ల 1350 మెగావాట్ల సామర్థ్యంతో నాచారం, కోయబస్తీ గూడంలో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. అంబుజా సిమెంట్స్ రూ.1400 కోట్లతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంటు పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయిదారేళ్లలో ప్లాంటు పూర్తయ్యాక సుమారు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న పదేళ్లలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమలకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి(Gowtham Adani) సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు బాగున్నాయని అదానీ పేర్కొన్నారు.
దావోస్‌లో 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' క్యాంపెయిన్ - పెట్టుబడుల వేట షురూ చేసిన సీఎం రేవంత్
Aragen Pharma Company Investment in Telangana: మరోవైపు ప్రముఖ ఫార్మా కంపెనీ ఆరాజెన్ రూ.2000 కోట్లతో మల్లాపూర్‌లోని పరిశ్రమ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆరాజెన్ కంపెనీ సీఈవో మణి కంటిపూడి సమావేశమయ్యారు. అయిదేళ్లలో రూ.2,000 కోట్లతో మల్లాపూర్‌లో ఔషధ పరిశ్రమ విస్తరిస్తామని దీంతో సుమారు 1500 మందికి ఉపాధి లభిస్తుందని ఆరాజెన్ సీఈవో తెలిపారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్ డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, ఎల్డిసీ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సమావేశమైంది.
దావోస్‌లో బిజీబిజీగా సీఎం రేవంత్ - టాటా, అదానీ గ్రూప్స్ ఛైర్మన్లతో భేటీ
దావోస్‌లో పెట్టుబడుల వేట షురూ- హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రానికి ఒప్పందం