CM Revanth meet Tata Technologies Representatives : రాష్ట్రంలో ఐటీఐలలో కోర్సుల రూపురేఖలు మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 ఐటీఐలలో సుమారు రూ.1500 నుంచి రూ.2 వేల కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది.
మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
డిమాండ్ ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించడానికి 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తుంది. అత్యాధునిక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇద్దరు మాస్టర్ ట్రైయినర్లను కూడా టాటా టెక్నాలజీస్(Tata Technologies) అందిస్తుంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రొబోటిక్స్, సీఎన్‌సీ మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ వంటి పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యాన్ని అందించేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చింది.
-
ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడంద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్… pic.twitter.com/qYfHeUToJR
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడంద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్… pic.twitter.com/qYfHeUToJR
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2023ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడంద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్… pic.twitter.com/qYfHeUToJR
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2023
Tata Technologies Skill Development : ఈ ప్రాజెక్టులో ఐదేళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందించనుంది. టాటా టెక్నాలజీస్ ప్రతిపాదనలకు సీఎం అంగీకరించారు. టాటా టెక్నాలజీస్‌తో ఎంఓయు కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కోరారు. సుమారు లక్ష మంది విద్యార్థులు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు రావడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది - మార్చి 18 నుంచే ఎగ్జామ్స్
ప్రపంచంతో పోటీపడేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. తెలంగాణలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర పభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా సాంకేతిక కోర్సులను పూర్తిచేసిన వెంటనే ఉద్యోగ, ఉపాధికి అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని టాటా సంస్థ ప్రతినిధులకు, అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.
కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా ఆధునాతన కోర్సుల్లో శిక్షణకోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఎంవోయూ, విధివిధానాలు ఖరారు చేసేందుకు టాటా టెక్నాలజీతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న ఉపాధికల్పన, కార్మిక శాఖ రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఐటీఐలను కూడా గుర్తించింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కార్మిక, ఉపాధికల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎంఓ అధికారులు శేషాద్రి, షానవాజ్, అజిత్ రెడ్డిలతో టాటా టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీవీ కౌల్గుడ్, గ్లోబల్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ పాల్గొన్నారు.