ETV Bharat / state

పేదల వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యత: ఉప సభాపతి​ - సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఉపసభాపతి

పేద ప్రజల వైద్య సేవలకు తమ ప్రభుత్వం అధిక ప్రాముఖ్యతనిస్తుందని ఉప సభాపతి​ తీగుల్ల పద్మారావు గౌడ్​ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహానిధి కింద మంజూరైన చెక్కులను సికింద్రాబాద్​ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

cm relief fund Cheques Distribution to the poor by Deputy Speaker at secunderabad in hyderabad
పేదల వైద్య సేవలకు తాము అధిక ప్రాముఖ్యత: ఉప సభాపతి​
author img

By

Published : Aug 8, 2020, 9:45 AM IST

పేద కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం, అడ్డగుట్ట డివిజన్​లోని శాంతినగర్లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన అబ్దుల్ హన్నన్, అబ్దుల్ మన్నన్ అనే ఇద్దరు అన్నదమ్ములకి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స కోసం విడుదలైన రూ. 2 లక్షల నిధుల మంజూరు పత్రాలను డిప్యూటీ స్పీకర్​ శుక్రవారం టకార బస్తీలోని తన క్యాంపు కార్యాలయంలో అందించారు. పేదల వైద్య సేవలకు తాము అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.