ETV Bharat / state

CM KCR: బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోం..

ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేవరకు విశ్రమించనని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు

cm kcr wishes
CM KCR: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోం.
author img

By

Published : Jun 1, 2021, 10:03 PM IST

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్న ఆయన... నాటి ఉద్యమ నినాదాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. సాగు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పించు కుంటూ వస్తున్నామని వివరించారు.

అభివృద్ధి ద్వారానే ఘన నివాళి

భారత దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ... అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో విస్మరించిన ఒక్కో రంగాన్ని దార్శనికతతో అవాంతరాలు లెక్కజేయకుండా సరిదిద్దుకుంటూ వస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సీఎం తెలిపారు. ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అంతకు మించి... అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళి అర్పించాలనే స్పూర్తి సర్కారుకు ఉందని పేర్కొన్నారు.

అందరికీ అండగా ప్రభుత్వం

వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులు, ఇతర వృత్తులతో పాటు ఆసరా అందాల్సిన అందరికీ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ తెలంగాణ సాధించుకున్న ఫలితాలను వారికి అందిస్తూ, వారి ఆనందంలో ప్రభుత్వం భాగస్వామిగా మారిందని వివరించారు. రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడమే కాకుండా ఏడేండ్ల అనతికాలంలోనే తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా నిలపడం వెనక ప్రభుత్వం అకుంఠిత దీక్ష ఇమిడి ఉందని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, వ్యవసాయాన్ని స్థిరీకరించడం ద్వారా గ్రామీణ వ్యవస్థను ఆర్ధికంగా పరిపుష్టం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైందని కేసీఆర్ తెలిపారు.

ప్రజల సహకారం గొప్పది..

ఈ ఘన విజయంలో తెలంగాణ ప్రజల సహకారం ఎంతో గొప్పదన్న ఆయన... అందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా ఉపద్రవం కారణంగా రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ ముందుకు పోతున్నామని కేసీఆర్ అన్నారు. ప్రజలు తనమీద నిలిపిన విశ్వాసం, అభిమానమే తనకు కొండంత ధైర్యమని తెలిపారు. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు విశ్రమించనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Tamilisai: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.