ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ... వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. శనివారమే సమీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఆధార్ ప్రస్తావనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించింది.
ప్రస్తుతానికి పాతవిధానంలోనే రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పటికే చాలా రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన నేపథ్యంలో పాత పద్ధతిలో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లకు అంగీకరించారు. ఆధార్ సేకరణ విషయంలో సందిగ్ధంపై సీఎం కేసీఆర్ ఆదివారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: 'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'