THub 2 launch: హైదరాబాద్‌లో టీ-హబ్ రెండో విడతను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాయదుర్గంలో టీ-హబ్ రెండో ఫేజ్‌ను ఎల్లుండి సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. తద్వారా నూతన అలోచనలకు, మరిన్ని స్టార్టప్‌లకు మంచి వాతావరణాన్ని కల్పించినట్లు అవుతుందని మంత్రి ట్వీట్ చేశారు. రాయదుర్గంలో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో.. ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఇంక్యుబేటర్ కానుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఫేజ్-1 ద్వారా 1,100 స్టార్టప్ కంపెనీలు రూ.1,860 కోట్ల నిధులు సేకరించాయని కేటీఆర్ వెల్లడించారు.
-
“The best way to predict the future is to create it” - Lincoln
— KTR (@KTRTRS) June 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Delighted to announce that Hon’ble CM KCR Garu will be inaugurating the new facility of @THubHyd on 28th June giving a huge fillip to the Hyderabad Innovation ecosystem#InnovateWithTHub #HappeningHyderabad #THub pic.twitter.com/ZT1BtRWoGt
">“The best way to predict the future is to create it” - Lincoln
— KTR (@KTRTRS) June 26, 2022
Delighted to announce that Hon’ble CM KCR Garu will be inaugurating the new facility of @THubHyd on 28th June giving a huge fillip to the Hyderabad Innovation ecosystem#InnovateWithTHub #HappeningHyderabad #THub pic.twitter.com/ZT1BtRWoGt“The best way to predict the future is to create it” - Lincoln
— KTR (@KTRTRS) June 26, 2022
Delighted to announce that Hon’ble CM KCR Garu will be inaugurating the new facility of @THubHyd on 28th June giving a huge fillip to the Hyderabad Innovation ecosystem#InnovateWithTHub #HappeningHyderabad #THub pic.twitter.com/ZT1BtRWoGt
కార్యక్రమానికి యూనికార్న్ స్టార్టప్‌లు మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్ కేర్, డెలివరీ వ్యవస్థాపకులతోపాటు సీక్యా క్యాపిటల్, యాక్సిల్, ఎండియా పార్ట్‌నర్స్, కలారి క్యాపిటల్ వంటి వెంచర్ పెట్టుబడిదారులు, మారుతి సుజూకి, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్‌ఏపీ వంటి కార్పొరేట్ దిగ్గజాల ప్రతినిధులు హాజరు కానున్నారు. అంకురాలతోపాటు వెంచర్ క్యాపిటలిస్టులకు కూడా టీహబ్ రెండో దశలో చోటు కల్పించనున్నారు. ఈ భవనం దేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలో రెండో పెద్ద ఇంక్యుబేటర్‌గా నిలువనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టం మరింతగా బలపడుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. టీహబ్ రెండో దశతో రాష్ట్ర ఖ్యాతి జాతీయ స్థాయిలో మరింత ఇనుమడిస్తుందని అంటున్నారు.
ఇవీ చూడండి..
స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా.. టీహబ్-2కి సర్వం సిద్ధం
raithu bandhu funds release: ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లో 'రైతు బంధు'